Anil Ravipudi, Devi Sri Prasad, Rajendra Prasad Stills Dancing For Daang Daang Song From Sarileru Neekevvaru At Visakha Utsav

విశాఖ ఉత్సవ్‌ లో అశేషప్రేక్షకాభిమానుల మధ్య సూపర్ స్టార్ మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమో లాంచ్!!

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. కాగా డిసెంబర్ 28న జరిగిన విశాఖ ఉత్సవ్‌ లో మంత్రి అవంతి శ్రీనివాస్ చేతులమీదుగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం నుండి డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి డాన్స్ చేయడం ప్రేక్షకాభిమానుల్ని అలరించింది. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకుల కోరికపై డాంగ్ డాంగ్ పాటకు డాన్స్ వేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా..

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ - " జనవరి 11న సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు విడుదల కాబోతుంది. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరి మనసులను దోచుకోబోతున్నారు మహేష్ బాబు. అనిల్ రావిపూడి నుండి నెవర్ సీన్‌ బిఫోర్ మూవీ అలాగే మహేష్ బాబు గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరబుల్ మూవీ. మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయండి దాని కంటే ఎక్కువే ఉంటుంది" అన్నారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - "లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ఎఫ్2 సినిమా కోసం విశాఖ ఉత్సవ్‌కి వచ్చి సక్సెస్ అయ్యాం. ఆ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేశారో నేను ఎప్పటికి మర్చిపోలేను. ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవ్ కి వచ్చి 'సరిలేరు నీకెవ్వరు' నుండి డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమో లాంచ్ చేశాం. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఫస్ట్ జడ్జ్. ఆయనిచ్చిన ఫీడ్ బ్యాక్ నేనెప్పుడూ మరువలేను. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. జనవరి ఫస్ట్ కి మనందరికీ ఒక కావాలి.. హ్యాపీగా మంచి పార్టీ సాంగ్ ఇచ్చారు. ఈ పాటలో మీరు చూసిన డాన్స్ కొంచమే, మైండ్ బ్లాక్ పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు డాన్స్ ఇంకా ఇరగదీశారు. మహేష్ బాబు గారు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చారు. ఆయనతో చేసిన ఈ జర్నీ మరిచిపోలేనిది. ఆయన హీరోగానే కాదు వ్యక్తిగతంగా కూడా సూపర్ స్టార్. ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా జెన్యూన్ పర్సన్. ఈ సినిమా రూపంలో మంచి సక్సెస్ ఇచ్చి ఆయ‌న‌కు చిన్న‌ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నా. మహేష్ చేసిన కామెడీ, ఎమోషన్స్ చూసి చాలా ఎక్సయిట్ అవుతారు. ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చారు. ఇక వెటరన్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చాలా ముఖ్యమైన పాత్ర చేశారు, మహేష్ బాబు రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా ఆరంభం నుంచి చివరిదాకా ఆద్యంతం అలరిస్తాయి. అలాగే 13 ఏళ్ల తరువాత విజయశాంతి గారు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. డెఫినెట్‌గా గతేడాది సంక్రాంతికి ఎఫ్2 సినిమాని ఎలా ఎంజాయ్ చేశారో ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' తో అంత కన్నాఎక్కువ ఎంజాయ్ చేస్తారు" అన్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ - "సరిలేరు నీకెవ్వరు` ప్రతి పాటను ఒక చార్ట్ బస్టర్ గా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు 2020 వెల్కమ్ చేస్తూ పార్టీ చేయడం కోసం డాంగ్ డాంగ్ పాట ప్రోమో ని లాంచ్ చేశాం. ఈ సినిమాలో మహేష్ గారిని కొత్త కోణంలో చూడబోతున్నారు. ముఖ్యంగా భీభత్సమైన డాన్స్ మూమెంట్స్ తో చూడబోతున్నారు, అనిల్ రావిపూడి అదరగొట్టాడు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు" అన్నారు.

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - " అనిల్ రావి పూడి ఈ సినిమాని చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. 'సరిలేరు నీకెవ్వరు' నాకు జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభూతిని,అనుభవాన్ని ఇచ్చిన సినిమా" అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Anil Ravipudi, Devi Sri Prasad, Rajendra Prasad Stills Dancing For Daang Daang Song From Sarileru Neekevvaru At Visakha Utsav (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Anil Ravipudi, Devi Sri Prasad, Rajendra Prasad Stills Dancing For Daang Daang Song From Sarileru Neekevvaru At Visakha Utsav (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Anil Ravipudi, Devi Sri Prasad, Rajendra Prasad Stills Dancing For Daang Daang Song From Sarileru Neekevvaru At Visakha Utsav (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Anil Ravipudi, Devi Sri Prasad, Rajendra Prasad Stills Dancing For Daang Daang Song From Sarileru Neekevvaru At Visakha Utsav (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%