DTS Movie Launched

లాంఛనంగా ప్రారంభమైన డిటియస్ మూవీ

కొత్త కాన్సెప్ట్ లను ప్రేక్షకులు ఎప్పుడూ ఆహ్వానిస్తారు, ఆదరిస్తారు. కొత్త కాన్సెప్ట్ తో యంగ్ టీం తో డిటియస్ మూవీ ప్రారంభం లాంఛనంగా జరిగింది. ఇప్పటి వరకూ తెలుగు తెరమీద చూడని కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీ లో ఆశిష్ గాంధీ, పూజా జవేరి జంటగా నటిస్తున్నారు. శ్రీ భవిత క్రియేషన్స్ బ్యానర్ లో నూతన దర్శకుడు అభిరామ్ పిల్లా దర్శకత్వంలో రూపొందబోయే ఈ మూవీ ప్రారంభం ప్రొడక్షన్ ఆఫీస్ లో చిత్రయూనిట్ సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా :
హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ: ‘‘ నాటకం తర్వాత కొత్త కాన్సెప్ట్ ల కోసం చూస్తున్న టైంలో అభిరామ్ చెప్పిన కథ నన్ను బాగా ఎక్సైట్ చేసింది. ఆ కథతో మా ప్రయాణం మొదలయ్యాక నిర్మాత గంగా రెడ్డి గారికి కాన్పెప్ట్ చెప్పాము. ఆయనకు నచ్చి వెంటనే సినిమా ప్రారంభించారు. మా ప్రయత్నం తప్పకుండా విజయవంతం అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

హీరోయిన్ పూజా జవేరి మాట్లాడుతూ: ‘‘ అభిరామ్ కాన్సెప్ట్ చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ టీంలో మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, డిఓపి సతీష్ గారి కాంబినేషనల్ లో మరోసినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ టీం లో ఒక ఎనర్జీ కనిపిస్తుంది. ఆశిష్ తో కలసి పనిచేయడం ఇదే మొదటిసారి మా కాంబినేషన్ తెరమీద బాగుంటుందని నమ్ముతున్నాను. కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది ’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ మాట్లాడుతూ: ‘‘ కాన్సెప్ట్ వినగానే చాలా బాగా నచ్చింది, అభిరామ్ ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. నిర్మాత గంగారెడ్డి నాకు మంచి మిత్రుడు ఆయనకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో ప్రొడక్షన్ ను ప్రారంభించాము. డిటియస్ టైటిల్ అనగానే చాలా కొత్త గా ఫీల్ అయ్యాను . ఇలాంటి కాన్సెప్ట్ లకు మ్యూజిక్ అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

నిర్మాత గంగారెడ్డి మాట్లాడుతూ: ‘‘ డిసెంబర్ చివరి వారంలో షూటింగ్ కి వెళుతున్నాం. రెండు షెడ్యూల్స్ లో సినిమా కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేసాము. అభిరామ్ కాన్సెప్ట్ వినగానే చాలా కొత్త గా గ్రిప్పంగ్ గా అనిపించింది. మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణల వివరాలు త్వరలోనే తెలయజేస్తాం. మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

డిఓపి సతీష్ ముత్యాల మాట్లాడుతూ: ‘‘ ఇలాంటి సబ్జెక్ట్ లకు పనిచేయడం లో సినిమా టోగ్రాఫర్ కి ఒక ఛాలెంజ్ ఉంటుంది. అభిరామ్ స్ర్కిప్ట్ చెప్పగానే చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఇలాంటి యంగ్ టీంతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

బ్యానర్: శ్రీ భవితా క్రియేషన్స్
హీరో : ఆశిష్ గాంధీ
హీరోయిన్: పూజా జవేరి.

సాంకేతిక వర్గం:
మ్యూజిక్ : సాయి కార్తిక్, డి ఓపి : ముత్యాల సతీష్, పి. ఆర్. ఓ: జియస్ కె మీడియా, నిర్మాత గంగారెడ్డి, దర్శకత్వం :అభిరామ్ పిల్లా.

DTS Movie Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
DTS Movie Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
DTS Movie Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
DTS Movie Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
DTS Movie Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
DTS Movie Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%