Karthikeya’s 90ML Movie To Be Released On 6th December

డిసెంబర్ 6 న విడుదల కానున్న హీరో కార్తికేయ ' 90ml '

హీరో కార్తికేయకి RX100 వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై కొత్త దర్శకుడు శేఖ‌ర్ రెడ్డి యర్ర తో నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన 90 ml ని ఈ నెల 6న విడుదల చేయనున్నారు.

నేహా సోలంకిని హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పాటలకి, ప్రమోషనల్ టూర్లకి మరియు ప్రీ రిలీజ్ ఈవెంటుకి అనూహ్య స్పందన వచ్చింది.

ఇక కథ విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు దేవ‌దాస్‌, ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌టి విద్యావంతుడు 'ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌' గా ఎందుకు అయ్యాడన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. యూత్ కి కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు, కార్తికేయ డాన్సులు, డైలాగులు, ఫైట్స్ ట్రైలర్ లో కనిపించడంతో ప్రేక్షకుల్లో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి.ఈచిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ థియేట్రిక‌ల్ రైట్స్ ని శ్రీ వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థఫ్యాన్సీ ఆఫ‌ర్‌కి సొంతం చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సర్టిఫికెట్ లభించింది.

ఈ సందర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ "90ml ని మొదట డిసెంబరు 5 న విడుదల చేద్దాం అనుకున్నాము కానీ , కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6 కి మార్చుకున్నాం. పూర్తిగా కొత్త కథ కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కమెర్షియల్, ఎంటర్టైనింగ్ మరియు ఎమోషనల్ అంశాలతో రాబోతుంది. మా బ్యానర్ కి పేరు తెచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం RX100 ని మించిన హిట్ అవుతుందని మా ప్రగాఢ నమ్మకం’’ అని చెప్పారు.

పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, కెమెరా: జె.యువ‌రాజ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌, ఫైట్స్: వెంక‌ట్‌.

Karthikeya’s 90ML Movie To Be Released On 6th December (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Karthikeya’s 90ML Movie To Be Released On 6th December (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%