Raj Kandukuri Released The Trailer Of Film Samaram
`సమరం` ట్రైలర్‌ను విడుదల చేసిన రాజ్ కందుకూరి
సాగర్ గంధం, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సమరం. యూనివర్సల్ ఫిలింస్ బ్యానర్‌పై బషీర్ ఆలూరి దర్శకత్వంలో శ్రీనివాస్ వీరంశెట్టి, జీవీఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌కి సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. అన్ని కమర్షియల్ హంగులతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుందని, డిసెంబర్ నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.