Sai Dharam Tej Gifted Pearl Mallet Workstation To Music Director SS Thaman

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సుప్రీం హీరో సాయి తేజ్

Sai Dharam Tej Gifted Pearl Mallet Workstation To Music Director SS Thaman (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఈ పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తమన్, సాయి తేజ్ ఫ్రెండ్ షిప్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎంతో ఇష్టమైన తన ఫ్రెండ్ తమన్ కు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ తో నిజంగానే సర్ ప్రైజ్ చేసాడు సాయి తేజ్. తమన్ మ్యూజిక్ టేస్ట్ కి తగ్గట్టుగా పెర్ల్ మాలెట్‌స్టేషన్ అనే మ్యూజిక్ ఇన్స్ర్టూమెంట్ గిఫ్ట్ గా అందించాడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ. వీరిద్దరి కాంబినేషన్లో పలు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి.

తనకు సాయి ఇచ్చిన గిఫ్ట్ గురించి తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ ఈ లవ్‌లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్‌ప్రైజ్. ప్రతిరోజూ పండగే అన్న మాటను ఈయన నిజం చేసారు. సాయి చాలా మంచి వ్యక్తి ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నానంటూ ట్విట్టర్ లో ఫొటోతో సహా పోస్ట్ చేసాడు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%