South Cinema

Telugu Film Directors Association Condoles Director SP Rajaram Death

దర్శకుడు ఎస్పీ .రాజారామ్ మృతికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సంతాపం

అక్టోబరు 24న మరణించిన ప్రముఖ దర్శకుడు ఎస్. పి.రాజారామ్ కు నివాళులు అర్పిస్తూ ఈరోజు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అసోసియేషన్ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించింది.

కృష్ణ-శ్రీదేవి జంటగా నటించిన" సమాజానికి సవాల్" చిత్రంతో దర్శకుడు గా కెరీర్ ప్రారంభించిన ఎస్ పి రాజా రామ్ తెలుగులో వదినగారి గాజులు, ముద్దాయి ముద్దుగుమ్మ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు హిందీలో ఘర్వాలి- బాహార్ వాలి,అభీ అభీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా చలనచిత్ర దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్ మాట్లాడుతూ " సౌమ్యులు, సహృదయులు అయిన ఎస్పీ రాజారామ్ గారి మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక సీనియర్ సిన్సియర్ డైరెక్టర్ ను కోల్పోయింది. ఆయన మృతికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం పక్షాన తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తున్నాం "- అన్నారు. ఈ సంతాప సభలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి చెందిన పలువురు సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.

Telugu Film Directors Association Condoles Director SP Rajaram Death (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

Facebook Comments
Share