South Cinema

Whistle Movie Success Bringing In More Offers In Tollywood Deepak Bajwa

'విజిల్' విజయంతో టాలీవుడ్ లో మళ్ళీ మంచి ఆఫర్స్ వస్తున్నాయి - దీపక్ బజ్వా

తలపతి విజయ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపొందిన విజిల్ దీపావళి పండగ సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే...ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన విజిల్ మూవీలో విజయ్ సరసన నయనతార నటించగా, ఒక ముఖ్యమైన పాత్రలో దీపక్ నటించాడు. చాలా గ్యాప్ తరువాత ఫుట్ బాల్ కోచ్ గా ఈ చిత్రం లో నటించినందుకు, ఈ చిత్ర విజయం లో తానూ ఓ భాగమైనందుకు సంతోషిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

ఈ సందర్భంగా హీరో దీపక్ మాట్లాడుతూ...
"బాలీవుడ్ లో గురు, ప్యాషన్ చిత్రాల తరువాత మెయిన్ హీరోగా మూడు చిత్రాలు చేశాను అవి విజయం సాధించలేదు. మళ్ళీ 2016 లో రుస్తుం చిత్రం లో అక్షయ్ కుమార్ అపోజిట్ గా నటించాను. ఆ చిత్రంలో ప్రతి నాయకుడిగా మంచి పేరు వచ్చింది. తమిళ్ సినీరంగం లో దర్శకుడు అట్లీ గురించి విన్నాను. తనే స్వయంగా ఈ చిత్రం లో చేయమని ఫోన్ చేసి అడిగాడు. చాలా ఇంపార్టెంట్ పాత్ర అని చేశాను. విడుదలైన రోజునే థియేటర్ లో సినిమా చూసాను.ఇక విషయానికొస్తే... ఈ చిత్రం తెలుగు లో 'విజిల్' గా విడుదల ఐయ్యింది అన్న విషయం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది ఎందుకంటె హీరో గా నా పుట్టుకనిచ్చింది తెలుగు సినీరంగం సంపంగి నుండి మిత్రుడు వరకు నేను చేసింది పది చిత్రాలైన నన్ను ఎంతగానో ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. వారికి మారోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ఇక ఈ చిత్రం విషయానికొస్తే.....ఎప్పుడు కొత్త కథనాన్ని ఎంపిక చేసుకునే విజయ్ ఈ సారి కూడా దక్షిణ భారతానికి ఓ కొత్త కాన్సెప్ట్ అందించాడు.దర్శకుడు అట్లీ మరో మారు ఈ చిత్రంతో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. విజయ్ లాంటి స్టార్ హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా ఆయన కథలు ఎంచుకొనే విధానం, తెరపై చూపించే తీరు అద్భుతం. మాస్ పల్స్ కి దగ్గరా చిత్రాలు తీయడంలో అట్లీ కి ఉన్న విజన్ ని మెచ్చుకోవాల్సిందే. ఐతే తమిళ ప్రేక్షకుల నేటివిటీకి దగ్గరగా సాగే కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు కానీ కాన్సెప్ట్ ప్రకారం యూనివర్సల్ గా ఈ పాయింట్ అందరికి నచ్చుతుంది. ఇందులో నేను ఫుట్బాల్ కోచ్ గా నటించాను ఈ చిత్రం చూసిన కొంతమంది టాలీవుడ్ డైరెక్టర్స్ నుండి ఫోన్స్ వచ్చాయి. నా మొదటి సినిమా సంపంగి వచ్చి ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. నీలో భౌతికంగా ఎలాంటి మార్పు రాలేదు మంచి ఫైట్ నెస్ వుంది అప్పటి కంటే ఇప్పుడు లుక్ వైస్ చాలా బాగున్నావ్ అంటున్నారు. తెలుగు లో మళ్ళీ కంటిన్యూ చెయ్యొచ్చు కదా? అని అడిగారు. మళ్ళీ మంచి పాత్రలకు ఏమైనా అవకాశం ఇస్తే తప్పని సరిగా చేస్తాను" అంటూ తెలుగు లో తనకు అవకాశమిచ్చిన సాన యాదిరెడ్డి, శ్రీను వైట్ల, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బి ఏ రాజు, శ్రీమతి మంజుల నాయుడు, శివలంక కృష్ణ ప్రసాద్ గార్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Whistle Movie Success Bringing In More Offers In Tollywood Deepak Bajwa (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

Facebook Comments
Share