సెప్టెంబర్ 25న 'రాగల 24 గంటల్లో' టీజర్... అక్టోబర్ 18న సినిమా విడుదల
Ragala 24 Gantallo Movie teaser to release on September 25th, Movie on October 18th (Photo:SocialNews.XYZ)
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ "ఇటీవల పోస్టర్ నెంబర్ 1, పోస్టర్ నంబర్ 2 అని రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేశాం. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే, ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ పొందింది. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ నెల 25న టీజర్ విడుదల చేస్తాం. వచ్చే నెల 18న సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం. స్క్రీన్ ప్లే బేస్ డ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సినిమాలో నటీనటులందరూ అద్భుతంగా చేశారు. ప్రముఖ హాస్యనటుడు కృష్ణభగవాన్ మా చిత్రంతో మాటల రచయితగా పరిచయం అవుతున్నారు. ఆయన రాసిన మాటలు, రఘు కుంచె బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు, ‘గరుడ వేగ’ ఫేమ్ అంజి కెమెరావర్క్ సినిమాకి హైలెట్’’ అన్నారు.
కృష్ణభగవాన్, రవిప్రకాశ్, రవివర్మ, 'టెంపర్' వంశీ, అజయ్, అనురాగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: కృష్ణ భగవాన్
This website uses cookies.