A new series “Feet Up with The Stars – Telugu with LAKSHMI MANCHU” announced

సెలబ్రిటీస్ బెడ్ స్టోరీస్ తో వస్తున్నా - మంచు లక్ష్మి

A new series “Feet Up with The Stars – Telugu with LAKSHMI MANCHU” announced (Photo:SocialNews.XYZ)more
A new series “Feet Up with The Stars – Telugu with LAKSHMI MANCHU” announced (Photo:SocialNews.XYZ)more

సెలబ్రిటీస్ అంటే చాలామంది ఇష్టపడతారు. సినిమాల్లోనో లేక టివిల్లోనో వాళ్లను చూసి అభిమానిస్తుంటారు. ముఖ్యంగా సినిమా స్టార్స్ అంటే చాలామందికి ఓ ఆరాధనాభావం కూడా ఉంటుంది. తమ అభిమాన నాయక/నాయకిలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏం చేస్తుంటారా అని ఆలోచిస్తుంటారు. మామూలుగా డే టైమ్ మేటర్స్ చాలా వరకూ తెలిసిపోతుంటాయి. కానీ సెలబ్రిటీస్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది. వాళ్లు బెడ్ పైకి చేరిన తర్వాత వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది. ఆ రోజంతా వారికి ఎలా గడిచింది.. ఇలాంటి అంశాలతో పాటు.. ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పని, తెలియని విషయాలను కూడా తెలసుకోవాలనుకునే అభిమానులు చాలానే ఉంటారు.

అలాంటి వారికోసం బాలీవుడ్ లో ఫూట్ అప్ విత్ స్టార్స్ అంటూ ఓ క్రేజీ షో వస్తోంది. కాస్త ఫన్, క్రేజీ, ఇంకాస్త హాట్ గా ఉండే ఎన్నో విషయాలను వాళ్లు ఈ ఫూట్ అప్ విత్ స్టార్స్ లో షేర్ చేసుకుంటుంటారు.. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి స్పైసీ షో రాబోతోంది.. టాలెంటెడ్ యాక్ట్రెస్ మంచు లక్ష్మి హోస్ట్ గా ఈ షో త్వరలోనే తెలుగులో ప్రసారం కాబోతోంది. సింపుల్ గా చెబితే వీటిని ‘బెడ్ టైమ్ స్టోరీస్’అనుకోవచ్చు. లేదా బెడ్ టైమ్ ఇంటర్వ్యూ అని కూడా అనుకోవచ్చు. సెలబ్రిటీస్ తో మాట్లాడుతూ.. ఆ టైమ్ లో వారి ఫీలింగ్స్ ను ఆడియన్స్ కు తెలిసేలా మంచు లక్ష్మి ఈ షోను మరింత క్రేజీగా హోస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకూ తెలుగులో ఎన్నడూ రానటువంటి షోగా ఇది మారుతుందని బాలీవుడ్ షోస్ చూసిన ఎవరికైనా అర్థమౌతుంది.

వయాకామ్ 18వాళ్లు నిర్వహిస్తోన్న ఈ షోకు హోస్ట్ గా చేసే అవకాశం వచ్చినందుకు మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘ ఫూట్ అప్ విత్ స్టార్స్ తెలుగు వెర్షన్ హోస్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నారు. ఈ షో ఫార్మాట్ చాలా యూనిక్ గా ఉంది. మన అభిమాన సెలబ్రిటీస్ ఫీలింగ్స్ ను, సీక్రెట్స్ ను తెలుసుకునేందుకు ఇది ఓ పర్ఫెక్ట్ సెట్టింగ్. తమ అభిమాన తారలను అభిమానులకు చాలా దగ్గరగా చేస్తూ చాలా ఫన్ గా ఈ షో ఉండేలా ప్రయత్నిస్తాను. సెలబ్రిటీస్ లో నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.. వాళ్లందరితోనూ చేసే సంభాషణల కోసం నేనూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నాను. నాకే కాదు.. సెలబ్రిటీస్ కు కూడా ఇదో ఇంట్రెస్టింగ్ ఎక్స్ పీరియన్స్ మారబోతోంది. నేనూ ఈ షోకోసం చాలా వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ షోకోసం ఇప్పటికే చాలామందికి నచ్చే తారలతో ఇంటర్యూస్ సిద్ధంగా ఉన్నాయని.. ఇలాంటి సెన్సేషనల్ షో కోసం మీకూ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం అని వయాకామ్ 18 ప్రతినిధులు చెప్పారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%