Palasa 1978 Movie First Lyrical Video Released

పలాస 1978 సినిమా మొదటి లిరికల్ వీడియో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా విడుదల. రెట్రో స్టైల్ లో ఉన్న " ఓ సొగసరి" పాట కు విశేష ఆదరణ.

Palasa 1978 Movie First Lyrical Video Released (Photo:SocialNews.XYZ)more
Palasa 1978 Movie First Lyrical Video Released (Photo:SocialNews.XYZ)more
Palasa 1978 Movie First Lyrical Video Released (Photo:SocialNews.XYZ)more
Palasa 1978 Movie First Lyrical Video Released (Photo:SocialNews.XYZ)more

రియలిస్టిక్ కథలకు టైం పీరియడ్ కూడా తోడైతే ఆ కథలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో వస్తోన్న చిత్రం ‘పలాస 1978’. 1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.

చిత్ర కథాంశం గురించి తెలిసిన చాలామంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రఘు కుంచే సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లేటెస్ట్ సెన్సేషన్ పల్లెకోయి బేబీ కలిసి ఈ పాటను పాడటం విశేషం. బాలు ఓ ముప్ఫైయేళ్లు వెనక్కి వెళ్లి తన గాత్రాన్ని వినిపిస్తే బేబీ గాత్రం పాటకు ఓ ఫ్రెష్ నెస్ ను తీసుకువచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడాలనుకోవడం ఎవరికైనా ఓ కల. ఆ కలను గాయనిగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలోనే అందుకున్న పల్లెకోయిల బేబీ ఏకంగా ఆయనతో కలిసి డ్యూయొట్ ఆలపించేయడం నిజంగా విశేషమే. అంత పెద్ద లెజెండ్ తో పాడుతున్నా.. ఎక్కడా తొణక్కుండా తన సహజమైన గాత్రంతో ఆకట్టుకుంది.

లక్ష్మీ భూపాల ఈ పాటను రాశారు. దర్శకుడు కరుణ కుమార్ కు ఇది తొలి చిత్రం. కానీ ఆయన రచయితగా సాహిత్యలోకంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ రకంగా ఇది కథగా ఎంతో బలంగా ఉండబోతోందని కూడా అర్థం చేసుకోవచ్చు.

సుధ మీడియా పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. రఘు కుంచే తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, బండి సత్యం ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచే , పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, నిర్మాత : ధ్యాన్ అట్లూరి, రచన, దర్శకత్వం : కరుణ కుమార్.

Facebook Comments

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Share
More

This website uses cookies.