Megastar Chiranjeevi Congratulated The winners Of National Awards

మెగాస్టార్ చెప్పిన‌ట్లే జ‌రిగింది!

Megastar Chiranjeevi Congratulated The winners Of National Awards (Photo:SocialNews.XYZ)more
Megastar Chiranjeevi Congratulated The winners Of National Awards (Photo:SocialNews.XYZ)more

ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్త‌మ చిత్రంగా మ‌హాన‌టి ఎంపికైంది. ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్ విభాగంలోనూ మ‌హాన‌టి ఖాతాలో అవార్డులు చేరాయి. ఇక నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయకుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కినరంగ‌స్థ‌లంబెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగం నుంచి ఎంపికైంది. బెస్ట్ ఒరిజిన‌ల్ స్ర్కీన్ ప్లే నుంచి చిల‌సౌ కు,అ` చిత్రానికి గాను ఉత్తమ మేకప్ , ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు ద‌క్కాయి.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి అవార్డులు పొందిన వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం చిత్రాల‌కు జాతీయ అవార్డ‌లు వ‌స్తాయ‌ని ఆయ‌న‌ రిలీజ్ కు ముందుగానే చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌హాన‌టి రిలీజ్ అనంత‌రం చిరంజీవి యూనిట్ స‌భ్యుల‌ను ఇంటికి పిలిపించి ఘ‌నంగా స‌న్మానించిన సంగ‌తి విధిత‌మే. నాటి ఆయ‌న వాక్కులు నేడు ఫ‌లించ‌డంతో సంతోషాన్ని వ్య‌క్తం చేసారు. త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లంకు జాతీయ అవార్డు రావ‌డం. అలాగే ఇత‌ర భాష‌ల నుంచి అవార్డ‌ల‌కు ఎంపికైన వారంద‌రికీ మెగాస్టార్ అభినంద‌న‌లు తెలిపారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%