జాతీయ అవార్డ్ రావడం చాలా హ్యాపీగా ఉంది : రాహుల్ రవీంద్రన్
Director Rahul Ravindran expresses joy on winning National Award for ChiLaSow (Photo:SocialNews.XYZ)
చి.ల.సౌ. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను విడుదల చేసింది. గత ఏడాది ఆగస్ట్‌లో సినిమా విడుదలైంది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం గత ఏడాది చాలా పెద్ద విజయాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా... రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - మా చి.ల.సౌ` చిత్రానికి బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్ ప్లే అవార్డ్ రావడం ఆనందంగా ఉంది. ఈ సందదర్భంగా అమ్మానాన్నకు, నా భార్య చిన్మయికి, నా సోదరుడికి థ్యాంక్స్ చెబుతున్నాను. నేను ఉద్యోగం వదిలేసి వచ్చి సినిమాల్లో ప్రయత్నిస్తానని చెప్పగానే వాళ్లు ఎంకరేజ్ చేశారు. సపోర్ట్ అందించారు. నేషనల్ అవార్డ్ జ్యూరీకి స్పెషల్ థ్యాంక్స్. చిన్న సినిమా తీశామని నేను అవార్డ్ కోసం సినిమాను పంపాం ..మరచిపోయాం. కానీ ఇప్పుడు అవార్డ్ రావడం మరచిపోలేని ఆనందాన్ని ఇస్తుంది. సుశాంత్ ఈ సినిమా కథను నమ్మడంతో జర్నీ స్టార్ట్ అయ్యింది. అలాగే రుహాని శర్మ, సిరుని సినీ కార్పొరేషన్ అధినేతలు సహా ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. అలాగే రిలీజ్ సమయంలో నాగ్ గారు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. అదే మాకు పెద్ద ప్లస్ అయ్యి సినిమా రీచ్ పెరిగింది. మాతో పాటు చాలా తెలుగు సినిమాలకు అవార్డులు వచ్చాయని విన్నాం. ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్. తెలుగు సినిమాకు ఇది గొప్ప ఏడాది. తెలుగు సినిమాతో పాటు అవార్డులను అందుకున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.
This website uses cookies.