Shivaranjani movie will haunt: Producer Padmanabha Reddy

శివరంజని’ హాంట్ చేస్తుంది - నిర్మాత ఏ పద్మనాభరెడ్డి

Shivaranjani movie will haunt: Producer Padmanabha Reddy (Photo:SocialNews.XYZ)

సస్పెన్స్ అండ్ హారర్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. దానికి కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను కూడా మిక్స్ చేసుకుని వస్తోన్న సినిమా ‘శివరంజని’. రశ్మి, నందు, అఖిల్ కార్తీక్, ఇంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో నిర్మాత ఏ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ... ‘‘ యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన సినిమా ఇది. మా బ్యానర్ లో ‘రంగు’ తర్వాత వస్తోన్న సినిమా ఇది. లవ్, సస్పెన్స్, హారర్ తో పాటు థ్రిల్లర్ కూడా మిక్స్ అయిన కథ ఇది. ప్రధానంగా రశ్మి, ముగ్గురు అబ్బాయిల మధ్య జరిగే కథ. ఈ ముగ్గురిలో రశ్మి ఎవరిని ప్రేమించిందనేది సస్పెన్స్. వివి వినాయక్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ కు మంచి ఆదరణ వచ్చింది. మారుతి, బుర్రా సాయిమాధవ్ గార్ల్ చేతుల మీదుగా విడుదలైన పాటలూ ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. మెసేజ్ ఉండవు కానీ.. థ్రిల్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. ధన్ రాజ్ కామెడీ బాగా నవ్విస్తుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుంది. మొత్తంగా శివరంజని ఎవరు అనేది తెలుసుకోవడమే సినిమా. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నాం’’.. అని చెప్పారు.

దర్శకుడు నాగప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘ ఇది వాలి సినిమా నుంచి ఇన్స్ స్పైర్ అయి రాసుకున్న కథ ఇది. నిర్మాతగారికి కథ చెప్పగానే ఆయనకు బాగా నచ్చింది. ముందు క్లైమాక్స్ రాసుకుని ఆ తర్వాత కథగా డెవలప్ చేసిన కథ ఇది. రాఘవేంద్రరావు, చంద్రమహేష్, వినాయక్ గారి వద్ద అసిస్టెంట్ గా పనిచేశాను.. అనుకున్నదాని కంటే బాగా వచ్చింది. ఆర్టిస్టులంతా మంచి నటన చూపించారు. ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఆ అనుకున్న టైమ్ కు ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.. ’’ అని చెప్పారు.

శివరంజనిలో నందు, రష్మి గౌతమ్ జంటగా నటిస్తుండగా నందినీరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇతర పాత్రల్లో అఖిల్ కార్తీక్, ధన్ రాజ్, ఢిల్లీ రాజేశ్వరి, నటిస్తున్నారు.

యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సురేందర్ రెడ్డి, సంగీతం : శేఖర్ చంద్ర, సమర్పణ : నల్లా స్వామి, పి.ఆర్.ఓ : జి.ఎస్.కే మీడియా, సహ నిర్మాత : కటకం వాసు, నిర్మాతలు : ఏ పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు, దర్శకత్వం : నాగ ప్రభాకర్.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%