దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డితో మరో సినిమా చేస్తా – నిర్మాత కానూరి శ్రీనివాస్

Raagala 24 Gantallo movie producer Kanuri Srinivas will make another movie with director Srinivas Reddy (Photo:SocialNews.XYZ)
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా శ్రీనివాస్ రెడ్డి వంటి మంచి దర్శకుడితో చేయడం చాలా ఆనందంగా ఉంది. చెప్పిన కథను చెప్పినదానికంటే గొప్పగా తెరకెక్కించారు, అనుకున్న బడ్జెట్ లో అనుకున్న రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. నిర్మాత అంటే డబ్బులు పెట్టడమే కాదు, ప్రతిరోజు షూటింగ్ కి వచ్చి దగ్గరుండి అన్నీ చూసుకోవాలని సినిమా నిర్మాణం గురించి అన్నీ వివరించి చెప్పారు. అలాగే ప్రతిరోజు షూటింగ్ కి వెళ్లి అన్ని శాఖల వారి పని తీరును చూసాను, నాకు ఎంతో బాగా అనిపించింది. స్వతహాగా బిజినెస్‌మేన్ అయిన నేను సినిమా నిర్మాణం ఎంత కష్టమో, ఎంత కష్టపడతారో కళ్లారా చూసాను. ఈ సినిమా అయిన వెంటనే శ్రీనివాస్ రెడ్డి గారితోనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొంత గ్యాప్ తర్వాత మంచి కంటెంట్ తో కూడిన మంచి సినిమా స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా.100% ఇది అన్ని వర్గాల వారికీ నచ్చే సినిమా. ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ తో చేసిన అద్భుతమైన సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమా. ఈషా రెబ్బ ఈ సినిమా తర్వాత పెద్ద హీరోయిన్ల జాబితాలో చేరుతుంది అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది. హీరో గా నటించిన సత్యదేవ్ ఈ సినిమా తర్వాత మంచి హీరోగా బిజీ అవుతాడు . అతనొక వండర్ ఫుల్ ఆర్టిస్ట్. అలాగే ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో హీరో శ్రీరామ్ నటించారు. ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ హాస్యనటుడు కృష్ణభగవాన్ మాటలు రాయడం. ముస్కాన్ సేథీ, గణేష్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్, అనురాగ్, అజయ్, టెంపర్ వంశీ, రవిప్రకాష్, రవివర్మ, అదిరే అభి ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆలీబాబా, సంగీతం రఘు కుంచె, ఫోటోగ్రఫీ: అంజి, మాటలు: కృష్ణ భగవాన్, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్: చిన్న, కథ: శ్రీనివాస్ వర్మ.
This website uses cookies.