Darpanam movie team busy with censor work

సెన్సార్ కార్యక్రమాల్లో "దర్పణం"

Darpanam movie team busy with censor work (Photo:SocialNews.XYZ)

త‌నిష్క్‌రెడ్డి, ఎల‌క్సియ‌స్‌ జంటగా రామ‌కృష్ణ వెంప ద‌ర్శ‌క‌త్వం లో శ్రీ‌నంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిర‌ణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'ద‌ర్ప‌ణం'.. రామానాయుడు స్టూడియో లో లాంఛనంగా ప్రారంభమయిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభించగా.. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలలో ఉంది..

ఈ సందర్భంగా డైరెక్టర్ రామ‌కృష్ణ వెంప మాట్లాడుతూ... క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రం చాల బాగా వచ్చింది.. లాస్ట్ మినిట్ వ‌ర‌కు ఏం జ‌రుగుతుందా అని స‌స్పెన్స్ ని క్రియేట్ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది.. న‌టీన‌టులంద‌రూ చాలా బాగా చేశారు. ప్రొడ్యూసర్ గారి సహకారం మర్చిపోలేనిది.. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా ని నిర్మించారు.. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది.. అన్నారు..

నిర్మాత క్రాంతి కిర‌ణ్ వెల్లంకి మాట్లాడుతూ.... చాలా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి సినిమా చేశాము.. ఈ చిత్రానికి అందరు సపోర్ట్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని సెన్సార్ పనుల్లో ఉన్నాము.. వచ్చేనెలలో సినిమా రిలీజ్ అవుతుంది.. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్ సినిమా లను మించి ఈ సినిమా ఉంటుంది అన్నారు..

కెమెరామెన్ః స‌తీష్‌ముత్యాల‌, ఎడిట‌ర్ఃస‌త్య‌గిడుతూరి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ఃసిద్దార్ధ్ స‌దాశివుని, ప్రొడ్యూస‌ర్ఃక్రాంతి కిర‌ణ్ వెల్లంకి, డైరెక్ట‌ర్ః రామ‌కృష్ణ‌. వెంప‌.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%