Director Sukumar Launched Stuvartpuram Movie Trailer And First Look

"స్టూవర్టుపురం" మూవీ ట్రైలర్ ని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన క్రేజీ దర్శకుడు సుకుమార్...

Director Sukumar Launched Stuvartpuram Movie Trailer And First Look (Photo:SocialNews.XYZ)

అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో గూఢచారి ఫేమ్ ప్రీతి సింగ్ ప్రధానపాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "స్టూవర్టుపురం". ప్రస్తుతం ఈ చిత్రం యు/ఏ సెర్టిపికెట్ తో సెన్సార్ పూర్తి చేసుకొని జూన్ 14 న విడుదలకు సిద్ధమౌతున్నది. ఈ సందర్బంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేసారు.

అనంతరం సుకుమార్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా ఆసక్తి కలిగిస్తుంది. దర్శకుడు సత్యనారాయణ చాలా కొత్త ఐడియా తో ఈ సినిమాను తెరకెక్కించాడు. పైగా ఈ సినిమాకు ఆయన ఒక్క దర్శకుడు మాత్రమే కాకుండా ఎడిటింగ్, కెమెరా ఇలా ఆల్ రౌండర్ గా పనిచేసి చాలా తక్కువ సమయంలో సినిమా చేసాడు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ టీం కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.

సమర్పకుడు రంజిత్ కోడిప్యాక మాట్లాడుతూ ...ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారికి మా ధన్యవాదాలు. మా సినిమా ట్రైలర్ విడుదల చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు.గతంలో మా బ్యానర్ లో నిర్మించిన నందికొండ వాగుల్లోనా, మోని చిత్రాల దర్శకుడు సత్యనారాయణ ఏకారి అద్భుతంగా తెరకేకించాడు, ఫస్ట్ కాపీ తో రెడీగా ఉంది, జూన్ 14న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

దర్శకుడు సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ ... మా స్టూవర్ట్ పురం సినిమా ట్రైలర్ విడుదల చేసిన ప్రముఖ దర్శకులు, మాకు మార్గదర్శకులు సుకుమార్ గారికి కృతజ్ఞతలు. ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాను. ట్రైలర్ చూసి బాగా నచ్చిందని ప్రోత్సహించారు. దాంతో పాటు ఆయన చెప్పిన కొన్ని సలహాలను కూడా పాటిస్తాం. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే నర రూప రాక్షసులాంటి స్టూవర్టుపురం గ్యాంగ్, హీరోయిన్ ఇంట్లోకి చొరబడతారు , అప్పుడు హీరోయిన్ వాళ్ళను ఎలా డీల్ చేసిందన్న పాయింట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దాం, రిరికార్డింగ్ కు మంచి స్కోప్ ఉన్న ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నవనీత్ చారి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అందించారు, ఈ చిత్రం మా బ్యానర్ లో మూడోవ చిత్రంగా మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది అన్నారు.

హీరోయిన్ ప్రీతి సింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసిన క్రేజీ దర్శకుడు సుకుమార్ సర్ కు థాంక్స్. ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు.

మల్లికా ,రవిరాజ్,భాను ప్రసాద్ ,హర్ష నల్లబెల్లి ,శివప్రసాద్ ,సాయిరామ్ దాసరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : వెమేష్ పెట్ల , కెమెరా ,
ఎడిట్టింగ్ : లక్కీ ఏకరీ , సంగీతం : నవనీత్ చారి , కో డైరెక్టర్ : టైగర్ రాంబాబు , సమర్పణ : రంజిత్ కోడిప్యాక ,కథ స్క్రీన్ ప్లే , నిర్మాత , దర్శకత్వం : సత్యనారాయణ ఏకారి

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%