South Cinema

NagaKanya movie to release as this summer special

వేస‌వి కానుక‌గా ఏప్రిల్ లో విడుద‌ల కాబోతున్న వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న "నాగకన్య - ఆడియోకి సూప‌ర్ రెస్పాన్స్

NagaKanya movie to release as this summer special (Photo:SocialNews.XYZ)
NagaKanya movie to release as this summer special (Photo:SocialNews.XYZ)

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా... ఈ చిత్రాన్ని వేస‌వి కానుక‌గా విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ తో పాటు ఆడియోకి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది, ఈ నేప‌థ్యంతోనే ఏప్రిల్ లో నాగ‌క‌న్య ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న నాగకన్య లుక్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా మొదటి పోస్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ ని, రెండో పోస్టర్ గా లక్ష్మిరాయ్ లుక్ ని విడుదల చేశాం. విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. జై క్యారెక్టర్ మరో హైలైట్ గా నిలుస్తుంది. డైరెక్టర్ సురేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాం. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ పాత్రలు వూహించని విధంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కు మంచి పేరొచ్చేలా ఉంటుంది. వేసవి కానుకగా ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. వేస‌విలో పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా నాగ‌క‌న్య ని చూసి ఆనందిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

Facebook Comments
Share