Choti Choti Baatein song from Maharshi gets a tremendous response

ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి యాదే..' 'మహర్షి' ఫస్ట్‌ సింగిల్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌

Choti Choti Baatein song from Maharshi gets a tremendous response (Photo:SocialNews.XYZ)

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని మొదటి పాటను మార్చి 29న విడుదల చేశారు.

'ఛోటి ఛోటి చోటి ఛోటీ బాతే.. మీటి మీటి మీటి మీటీ యాదే.. ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే.. ఈ చెలిమికే కాలమే చాలదే...' అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీ ప్రసాద్‌ స్వీయ సంగీత సారధ్యంలో గానం చేశారు. స్నేహంలోని మాధుర్యాన్ని ఎంతో అందమైన పదాలతో శ్రీమణి పాటగా మలిచిన తీరు బాగుంది. అంతే అందంగా, అంతే మధురంగా దేవిశ్రీప్రసాద్‌ ఈ పాటను అందరికీ కనెక్ట్‌ అయ్యేలా పాడారు. ఈ పాటకు శ్రోతల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రతి వారం ఒక పాట విడుదల చేయబోతున్నారు.

దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్‌ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌బాబు, కె.ఎల్‌.ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%