South Cinema

Prabhas to do a film with SS Rajamouli’s assistant

రాజమౌళి శిషుడితో ప్రభాస్ సినిమా !

Prabhas to do a film with SS Rajamouli's assistant

ప్రభాస్ నటిస్తోన్న సాహో ఈ ఏడాది ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

 

తాజా సమాచారం మేరకు ప్రభాస్ కు రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన కృష్ణ ఒక కథ వినిపించాడని వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమాకు దర్శకత్వ శాకలో పనిచేసిన కృష్ణ త్వరలో ప్రభాస్ ను డైరెక్ట్ చెయ్యబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది కావున దర్శకులు ప్రభాస్ మార్కెట్ ను గుర్తు పెట్టుకొని అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా కథలు సిద్దం చేస్తున్నారు. సాహో ఒక అడ్వెంచర్గా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా రాధాకృష్ణ సినిమా అందుకు భిన్నంగా లవ్ స్టోరీ చేస్తున్నాడు.

Facebook Comments
Share