South Cinema

Mahesh to give a social message with Maharshi?

మహేష్ మెసేజ్ ఇవ్వబోతున్నాడు !

Mahesh to give a social message with Maharshi?

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు చెయ్యబోతున్న సినిమా ఎంటనే సందేహం అభిమానుల్లో ఉంది. కొందరు అనిల్ రావిపూడితో సినిమా చెయ్యబోతున్నాడని అంటున్నారు.

 

తాజా సమాచారం మేరకు సుకుమార్ సినిమానే మహేశ్ బాబు మొదట స్టార్ట్ చెయ్యబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఈ చిత్ర కథాంశం ఉంటుందని అంటున్నారు. మైత్రి మూవీస్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ నుండి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మహర్షి సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేవి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మాడ్రన్ ఫార్మింగ్ గురించి మహేశ్ బాబు ఈ సినిమాలో చర్చించబోతున్నాడని సమాచారం. కమర్శియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ ఈ సినిమాలో ఉండబోతోంది.

Facebook Comments
Share