Social News XYZ     

Nagma to play Allu Arjun’s Mom?

త్రివిక్రమ్ సినిమాలో బన్నీ తల్లి ఎవరు ?

టాప్ తెలుగు హీరోలతో ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన నగ్మా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే తాజా సమాచారం మేరకు నగ్మా అల్లు అర్జున్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో నగ్మా అల్లు అర్జున్ తల్లి పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది.

దర్శకుడు త్రివిక్రమ్ తన సినిమాల్లో నదియా, కుష్బూ వంటి వారికి ముఖ్య పాత్రలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కుష్బూ ను మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ఆమె ఈ సినిమా తరువాత మరిన్ని మంచి సినిమాల్లో నటించే అవకాశం ఉంది.

 

మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంస్థలు నిర్మించబోతున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. సినిమా అధిక భాగం ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.

Facebook Comments

%d bloggers like this: