Puri Jagan planning a special item song for iSmart Shankar

పూరి జగన్నాధ్ భారీ ప్లానింగ్ !

Puri Jagan planning a special item song for iSmart Shankar (Photo:SocialNews.XYZ)

పోకిరి సినిమాలో మొమైత్ ఖాన్ ఐటెమ్ సాంగ్ 'ఇప్పటికీ ఇంకా నా వయసు' అందరికీ తెలుసు. పూరి దర్శకత్వం వహించిన ఆ సినిమా కోసం మణిశర్మ స్వరపరిచిన ఆ పాట బాగా పాపులర్ అయ్యింది. ఆ సినిమా తరువాత చాలా మంది దర్శక నిర్మాతలు వారి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ ప్లాన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

తాజాగా పూరి, మణిశర్మ కలిసి చేస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హైదారాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పూరీ ఒక స్పెషల్ ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు.

మణిశర్మ, పూరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయినందున ఆ స్థాయిలో ఐటెమ్ సాంగ్ ఊహిస్తారు పేక్షకులు. మరి సాంగ్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ఈ సినిమాలో రామ్ పాత్ర డిఫరెంట్ గా డిజైన్ చేశాడట పూరి. ఛార్మి ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం.

Facebook Comments
Share

This website uses cookies.