Nani to produce two more films

నాని నిర్మాతగా రెండు సినిమాలు !

హీరో నాని అ సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు నాని మరో రెండు సినిమాలు నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి కొత్త దర్శకులు, కొత్త నటులు కాదు.. అందరూ పెద్ద కావడం విశేషం.వివరాల్లోకి వెళ్ళితే...

నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో నాని నటిస్తూ నిర్మిస్తున్నాడు. నాని చెయ్యబోతున్న 25వ సినిమా కావడంతో కొంత ఆలస్యం అయినా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. థ్రిల్లర్ నేపద్యంలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.

ఈ మూవీతో పాటు నాని మరో సినిమా నిర్మించబోతున్నాడు. మారుతి ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. ఈ చిత్రంలో ఒక పెద్ద హీరోనే నటించే అవకాశాలు ఉన్నాయి. త్వరలో ఆ వివరాలు వెల్లడి కానున్నాయి. హీరోగా కొనసాగుతున్న నాని వరుసగా నిర్మాణం వైపు అడుగులు వెయ్యడం విశేషం.

Facebook Comments
Share

This website uses cookies.