South Cinema

Mahesh Babu to work with Anil Ravipudi?

మహేశ్ బాబు కొత్త సినిమా వివరాలు !

Mahesh Babu to work with Anil Ravipudi?
Mahesh Babu to work with Anil Ravipudi? (Photo:SocialNews.XYZ)

ఎఫ్ 2 సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి దిల్ రాజు బ్యానర్ లో ,లేడి ఓరియంటెడ్ సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం మేరకు అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా మహేశ్ బాబుతో చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఫ్యామిలీ ఎంటెర్టైనర్ కథను మహేశ్ బాబు కోసం అనిల్ రావిపూడి సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు ? వంటి విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేశ్ బాబు త్వరలో సుకుమార్ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు.

సుకుమార్ సినిమా మే నుండి ఉండొచ్చు. ఒక రెండు నెలలు అటూ ఇటూగా అనిల్ రావిపూడి సినిమా ఉండొచ్చని సమాచారం. కథ నచ్చితే ఏ దర్శకుడితోనైనా సినిమా చేసేందుకు వెనకాడదు మహేశ్ బాబు. మరి అనిల్ రావిపూడి తో మహేశ్ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Facebook Comments
Share