Payal Rajput to play the female lead in Nagarjuna’s next

ఆ హీరోయిన్ నాగార్జున పక్కన ఫిక్స్ !.

Payal Rajput to play the female lead in Nagarjuna’s next (Photo:SocialNews.XYZ)

నాగార్జున మార్చి నుండి మన్మధుడు 2 సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా యూరప్ లో అధికభాగం షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో ఆర్.ఎక్స్.100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

 

అయితే పాయల్ చేసేది సెకండ్ హీరోయిన్ రోల్ అని తెలుస్తోంది. నటనకు ప్రదాన్యం ఉన్న పాత్ర కావున పాయల్ ను తీసుకోవడం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

చిలాసౌ సినిమాను తీసిన విధానం నచ్చి నాగార్జున రాహుల్ రవీంద్రన్ కు మన్మధుడు 2 సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సినిమాతో పాటు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఆ వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Facebook Comments
Share