South Cinema

Mirnalini Ravi to play female lead in Varun Tej’s Valmiki

బెంగళూర్ అమ్మాయితో వరుణ్ తేజ్!

Mirnalini Ravi to play female lead in Varun Tej's Valmiki

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న వల్మీకి సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. 14 రీల్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

ఈ సినిమాలో వరుణ్ తేజ సరసన మిర్లాని రవి హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం. బెంగళూర్ కు చెందిన ఈ అమ్మాయి వరుణ్ తేజ్ పక్కన ఛాన్స్ కొట్టేయ్యడం విశేషం. తమిళ్ లో విజయం సాధించిన జీగార్తాండ సినిమాను ఈ మూవీ రీమేక్.

ఎఫ్ 2 సినిమా తరువాత వరుణ్ తేజ్ చేస్తోన్న సినిమా ఇదే. కొంత గ్యాప్ తీసుకొని హరీష్ శంకర్ ఈ సినిమా తీస్తున్నాడు. పక్కా స్క్రీన్ ప్లే తో రాబోతున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కు మరో మైల్ స్టోన్ సినిమా కాబోతోందని అంటున్నారు. ఈ చిత్రంలో మరో యువ హీరో నటించే అవకాశాలు ఉన్నాయి

Facebook Comments
Share