Telugu

Mahesh Babu dialogues on farming will highlight in Maharshi

మహేశ్ బాబు మహర్షి లేటెస్ట్ న్యూస్!

Mahesh Babu dialogues on farming will highlight in Maharshi

మహేశ్ బాబు 25వ సినిమా మహర్షి ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 

ఈ చిత్రంలో మహేశ్ బాబు పల్లెటూరు గొప్పదనం గురించి చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరించబోతున్నాయని సమాచారం. రైతులు, వ్యవసాయం గురించి ఈ సినిమాలో ప్రదానంగా చర్చ ఉంటుందని అంటున్నారు. బిలీనియర్ మహేశ్ బాబు తన గ్రామానికి వచ్చి వ్యవసాయం గురించి చెప్పే సన్నివేశాలు బాగుంటాయని టాక్.

కమార్కియల్ అంశాలతో పాటు మెసేజ్ ఉండే విధంగా ఈ సినిమాను తెరాకెక్కిస్తున్నారు వంశీ పైడిపల్లి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మహేశ్ ఫ్యాన్స్ ను ఏ రకంగా ఆకట్టుకోబోతోందో చూడాలి.

Facebook Comments
Share