Nani’s 25th film will be directed by his debut director Indraganti

నాని మొదటి సినిమా దర్శకుడే 25వ సినిమాకు కూడా!

నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో జర్సీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి నుండి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపద్యంలో ఈ సినిమా ఉంటుంది.

ఈ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు నాని. గతంలో నాని, ఇంద్రగంటి చేసిన అస్టాచెమ్మ, జెంటిల్మెన్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అదే తరహాలో ఈ సినిమా ఉంటుందేమో చూడాలి.

దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా నాని కెరీర్ లో 25వ సినిమా అవ్వడం విశేషం. నాని మొదటి సినిమా అస్టా చెమ్మ సినిమాకు దర్శకత్వం వహించిన ఇంద్రగంటి 25వ సినిమాను డైరెక్ట్ చెయ్యడం విశేషం. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

Facebook Comments
Share

This website uses cookies.