South Cinema

Arjun to act in Varun Tej’s next

మెగా హీరో సినిమాలో తమిళ నటుడు!

Arjun to act in Varun Tej's next

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి వరుణ్ తేజ్ తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపద్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను అల్లు అర్జున్ సొంత అన్న బాబీ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నాపేరు సూర్య సినిమాలో బన్నీ ఫాదర్ పాత్రలో నటించిన అర్జున్ ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో నటించే హీరోయిన్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఎఫ్ 2 సినిమాతో విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్ మరింత జోష్ తో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. హరీష్ శంకర్ తో ఒక సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నాడు వరుణ్ తేజ్.

Facebook Comments
Share