South Cinema

Srinu Vaitla to work with Gopi Mohan and Kona Venkat again?

మళ్ళీ టాప్ డైరెక్టర్ తో స్టార్ రైటర్స్ !

Srinu Vaitla to work with Gopi Mohan and Kona Venkat again?

స్టార్ రైటర్స్ కోనా వెంకట్, గోపి మోహన్ టాప్ డైరెక్టర్ శ్రీను వైట్ల తో కలిసి డి, రెడీ, దుబాయ్ శ్రీను, వెంకీ, దూకుడు వంటి సూపర్ హిట్ సినిమాలకు వర్క్ చేశారు. ఇటీవల వీరు విడిపోయారు, కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు కొన్ని సినిమాలు కలిసి పనిచెయ్యలేక పోయారు.

 

తాజా సమాచారం మేరకు మళ్ళీ ఈ ముగ్గురు కలిసి సినిమా చెయ్యబోతున్నట్లు సమాచారం. రవితేజ నటించిన అమర్అక్బర్ ఆంథోనీ సినిమా తరువాత శ్రీను వైట్ల మరోసారి గోపి మోహన్, కోనా వెంకట్ తో సినిమా చెయ్యబోతున్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో మొదలుకానుంది.

ఈ ప్రాజెక్టు లో నటించే హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న శ్రీనువైట్ల మరోసారి తన లక్కీ రైటర్స్ తో కలిసి చెయ్యబోతున్న సినిమా తనకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది ? ఈ సినిమాలో నటించే హీరో ఎవరు ? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Facebook Comments
Share