Mr.Majnu Movie Jukebox will be released on January 14th

జనవరి 14న 'మిస్టర్‌ మజ్ను' జ్యూక్‌ బాక్స్‌ విడుదల

Mr.Majnu Movie Jukebox will be released on January 14th

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మిస్టర్‌ మజ్ను'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలకు, టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 'ఏమైనదో... ఏమైనదో', మిస్టర్‌ మజ్ను టైటిల్‌ సాంగ్‌, 'హార్ట్‌ బ్రేక్‌' పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. జనవరి 14 ఉదయం 10 గంటలకు సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జ్యూక్‌ బాక్స్‌ను విడుదల చేయబోతున్నారు.

అఖిల్‌ అక్కినేని సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

Facebook Comments

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Share
More

This website uses cookies.