Mahesh Babu appreciates NTR Kathanayakudu

ఎన్‌టి‌ఆర్ కు సూపర్ స్టార్ ప్రశంశలు !.

ఎన్‌టి‌ఆర్ కథానాయకుడు సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయం సాధించింది. ఈ సందర్భంగా పలు సినీ దర్శకులు, హీరోలు ఈ సినిమా గురించి పాజిటీవ్ గా స్పందిస్తూ ట్విటర్ లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ వరుసలో చేరారు.

ఎన్‌టి‌ఆర్ కథనాయకుడు సినిమా గురించి మహేశ్ బాబు ట్విటర్ లో పోస్ట్ చేశాడు. సినిమా అద్భుతంగా ఉంది, దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం బాగుంది. ప్రతి పాత్రను అందంగా తీర్చి దిద్దారు. బాలకృష్ణ గారి రక్తంలోకి ఎన్‌టి‌ఆర్ వచ్చి నటించినట్లు ఉందని మహేశ్ బాబు తెలిపాడు.

ఎన్‌టి‌ఆర్ మహానాయకుడు సినిమా కోసం అందరితో పాటు తాను వెయిట్చేస్తున్నానని మహేశ్ బాబు చెప్పడం విశేషం. ఈ సినిమాకు పని చేసిన ప్రతివక్కరు సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్‌టి‌ఆర్, ఏఎన్ఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు అలాగే ఎన్‌టి‌ఆర్ కృష్ణుడి వేషంలో కనిపించే సీన్స్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%