South Cinema

Ram and Puri Jagannadh movie titled Ismart Shankar?

పూరీ, రామ్ సినిమాకు తెలంగాణ టైటిల్!

Ram and Puri Jagannadh movie titled Ismart Shankar?

పూరిజగన్నాధ్ దర్శకత్వంలో రామ్ నటించబోతున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ జనవరి 3న అధికారికంగా ప్రకటించబోతున్నారు. తాజా సమాచారం మీరాకు ఈ మూవీకి ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కథకు సెట్ అయ్యే విధంగా ఈ టైటిల్ ను పెట్టినట్లు తెలుస్తోంది.

 

స్మార్ట్ అనే పదం అందరికీ తెలుసు తెలంగాణలో ఇస్మార్ట్ అంటారు. ఆ విధంగా ఈ సినిమాకు ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు పూరీ. మాస్ ఎంటెర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈ ఏడాది మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పూరీ తీసిన సినిమాలు ఈ మధ్య పెద్దగా సక్సెస్ కాలేదు, అలాగే రామ్ సినిమాలు కూడా వరుస ఫ్లాప్స్ అయ్యాయి. ఇప్పుడు సక్సెస్ వీరిద్దరికి అవసరం. మరి ఈ సినిమా వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. దాదాపు ఒక కొత్త హీరోయిన్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. త్వరలో ఆ వివరాలు తెలియనున్నాయి.

Facebook Comments
Share