Bunny’s next goes back to Trivikram?

బన్నీ సినిమా ఆ దర్శకుడితోనే !

Bunny's next goes back to Trivikram?

అల్లు అర్జున్ సినిమా ఏ దర్శకుడితో ఉంటుంది అనే విషయంపై రకరకాల పేర్లు వినిపించాయి, చివరికి త్రివిక్రమ్ బన్నీతో సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ రోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు మెగా క్యాంప్ నుండి టాక్ వినిపిస్తోంది.

 

అరవింద సమేత సినిమా తరువాత త్రివిక్రమ్ బన్నీతో సినిమా చెయ్యబోతున్నాడు. అలాగే త్రివిక్రమ్, బన్నీ కలిసి చేస్తున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. హారికా హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాయి.

మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. కైరా అద్వానీ బన్నీ పక్కన నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కొంత గ్యాప్ తరువాత బన్నీ తన నెక్స్ట్ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నాడు. ఈ సినిమా ఏ జానర్ లో ఉంటుంది ? ఇతర నటీనటులు ఎవరు ? వంటి విషయాలకు త్వరలో క్లారీటి రానుంది.

Facebook Comments
Share