Arjun Reddy director Sandeep Reddy Vanga released My Dear Marthandam Trailer

అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేతుల మీదుగా “మై డియర్ మార్తాండం” ట్రైలర్ విడుదల

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్, కళ్యాణ్ విటపు ( అర్జున్ రెడ్డి ఫేం ) లు ముఖ్య తారాగణం గా కోర్ట్ రూమ్ డ్రామా కామేడి ఇంటరాగేషన్స్ జోనర్ లో తెరకెక్కిన చిత్రం ‘’మై డియర్ మార్తాండం”. ఈ సినిమా ట్రైలర్ ను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ విడుదల చేశారు.

తను మాట్లాడుతూ ట్రైలర్ చూస్తుంటే ఔట్ అండ్ ఔట్ కామెడీ గా సినిమా తెరకేక్కినట్టు కనపడుతుంది. ట్రైలర్ చాలా బాగుంది. పృథ్వి కామెడీ టైమింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ క్రిస్మస్ కూ సిని ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకొని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.., అని అన్నారు.

హీరో రాకేందు మౌళి మాట్లాడుతూ మా సినిమా పుల్ లేన్త్ కామెడి సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కించాం. చాలా బాగుంటుంది, అని తెలిపారు.

హీరోయిన్ కల్పికా గణేష్ మాట్లాడుతూ దర్శకుడు హరీష్ కె.వి గారు మంచి పాయింట్ తో ఈ సినిమాను తీశారు. సస్పెన్స్ డ్రామా లో సినిమా నడుస్తుంది, మీ అందరికి నచ్చుతుంది అన్నారు. హీరో కళ్యాణ్ విటపు మాట్లాడుతూ మంచి సినిమాను తీసాం, ఈ క్రిస్మస్ కి మిమ్మల్ని నవ్వించేందుకు వస్తున్నాం అన్నారు.

దర్శకుడు హరీష్ కె.వి మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది, కోర్ట్ రూమ్ డ్రామా, కామేడి ఇంటరాగేషన్స్ బ్యాక్డ్రాప్ లో కథ నడుస్తుంది, సినిమా లో పృథ్వి గారి కామేడి చాలా బాగా వచ్చింది, ఈ డిసెంబర్ 29 న వస్తున్నాం. ప్రేక్షకులు ఆధరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.

సుదర్శన్, హరీష్ కోయలగుండ్ల, మహేష్ విట్టా. గోకుల్, భరద్వాజ్, జబర్దస్త్ ప్రసాద్ లు మిగతా తారాగణంగా నటించిన ఈ సినిమాకు సంగీతం : పవన్. లిరిక్స్ : వెన్నలకంటి, రాకేందు మౌళి. ఎడిటర్ : గ్యారీ BH ఆర్ట్ డైరెక్టర్ : ప్రవీన్ DOP : రామ్ రెడ్డి నిర్మాత : సయ్యద్ నిజాముద్దీన్. రచన – దర్శకత్వం : కె.వి.హరీష్.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%