Is VV Vinayak & Balakrishna movie still on cards?

ఆ దర్శకుడితో బాలయ్య సినిమా ఉందా లేదా ?

బాలయ్య చెన్నకేషవ రెడ్డి సినిమా తరువాత మరోసారి దర్శకుడు వినాయక్ తో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మించబోతున్న ఈ సినిమాపై కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆగిపోయిందని బాలయ్య వినాయక్ సినిమాను పక్కనపెట్టి బోయపాటితో మూవీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ తాజా సమాచారం మేరకు బాలయ్య, వినాయక్ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య సినిమా అంటే అభిమానులు భారీ యాక్షన్ ఎపిసోడ్స్, కథ, డైలాగ్స్ కోరుకుంటారు. కావున ఆ స్థాయి కథ కోసం వినాయక్ కొంత కాలం వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు.

బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఒకటి రెండు రోజులు మినహా చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. రేపు 21న ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. సంక్రాంతి సందర్బంగా జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Facebook Comments
Share
More

This website uses cookies.