South Cinema

What is Niharika’s role in Sye Raa?

సైరా సినిమాలో నీహారిక పాత్ర ఏంటంటే...

What is Niharika's role in Sye Raa?

సైరా నరసింహారెడ్డి చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్న ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో నీహారిక ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

 

తాజా సమాచారం మేరకు నీహారిక ఈ సినిమాలో అప్పుడే వివాహం చేసుకున్న బోయ కులస్తురాలిగా కనిపించనుంది. కొన్ని పరిస్థితులు ఆమెను సైనికురాలిగా మరుస్తాయని సమాచారం. వివాహం తరువాత నరసింహారెడ్డి తో పాటు బ్రిటీస్ వారితో పోరాటం చెయ్యనుందని సమాచారం.

అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా వంటి టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్న గెటప్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిచింది.

Facebook Comments
Share