South Cinema

Sharwanand to do 96 movie remake?

శర్వానంద్ ఇది నిజమేనా ?

Sharwanand to do 96 movie remake?

తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 సినిమాను తెలుగులో దిల్ రాజు నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించే హీరోలు ఎవరన్న దానిపై సాయి ధరం తేజ్, నాని, గోపిచంద్ పేర్లు వినిపించాయి. చివరికి ఈ సినిమాను చెయ్యడానికి శర్వానంద్ ఒప్పుకున్నట్లు సమాచారం.

 

శర్వానంద్ ఈ సినిమా చెయ్యబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఎక్కడ అధికారికంగా ప్రకటన లేదు. శర్వానంద్ ప్రస్తుతం పడిపడిలేచే మనసు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

శర్వానంద్ మూవీస్ ను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. 96 సినిమా తెలుగులో శర్వానంద్ చేస్తే బాగుంటుంది. మరి తమిళ్ లో త్రిష చేసిన పాత్ర తెలుగులో ఎవరు చేస్తారో చూడాలి. శర్వా పడి పడి లేచే మనసు సినిమాతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Facebook Comments
Share