South Cinema

Balakrishna and Boyapati Srinu movie to be launched on March 18th!

హిట్ కాంబినేషన్ కు సర్వం సిద్దం!

Balakrishna and Boyapati Srinu movie to be launched on March 18th!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాలయ్య కెరీర్ లో పెద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. వచ్చే ఏడాది మార్చి 18న వీరి సినిమా ప్రారంభం కానుందని సమాచారం.

 

బాలకృష్ణ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఎన్‌టి‌ఆర్ బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరిలో ఒక పార్ట్, ఫిబ్రవరిలో మరో పార్ట్ విడుదల కానుంది. మార్చి నుండి బోయపాటి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు బాలయ్య. బోయపాటి శ్రీను తాజాగా దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలయ్య, బోయపాటి సినిమా అంటే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి నుండి బోయపాటి ఈ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు. ఈ మూవీతో పాటు బాలయ్య వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

Facebook Comments
Share