Ravi Teja and Producer Ram Talluri in a cold war

రవితేజ కు నిర్మాతతో కోల్డ్ వార్ ?

ఎస్.ఆర్. టి నిర్మాణ సంస్థ రవితేజతో నేలటికెట్ సినిమా తీసారు. ప్రస్తుతం వీరిద్దరు డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అయితే చిత్ర షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కావాలి. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇందుకు ప్రదాన కారణం నిర్మాతేనని టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి రవితేజను కొంత పారితోషకంతగ్గించుకోమని చెప్పినట్లు సమాచారం. రవితేజ ఈ సినిమాకోసం 10 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రవితేజ అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే చర్చ నిర్మాత హీరో మధ్య నడుస్తోందని అందుకు సినిమా ఆలస్యం అవుతుందని సమాచారం.

1980 నేపద్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నభ నటేశ్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డిస్కో రాజా టైటిల్ ఈ సినిమాకు ఖరారు చేసినట్లు సమాచారం.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%