Naga Babu angers Balakrishna fans

నాగబాబుపై బాలయ్య అభిమానులు ఫైర్ !.

నాగబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో నాకు బాలకృష్ణ ఎవరో తెలీదు అన్నాడు. లేటెస్ట్ ఇంటర్వ్యూ లో బాలయ్య తెలుసు అతను ఒక కమీడియన్ అన్నారు. నాగబాబు ఇలా వరుసగా బాలయ్య పై కామెంట్స్ చేస్తూ ఉండగా సోషల్ మీడియాలో నాగబాబుపై విమర్శలు చేస్తున్నారు. బాలయ్య ఎప్పుడూ నాగబాబును ఏమీ అనలేదు. సడన్ గా నాగబాబు బాలయ్య పై చేసే కామెంట్స్ సంచలనంగా మారాయి.

గతంలో నాగబాబు బాలయ్యతో కలిసి ఒక ఫంక్షన్ లో ఫోటో తీసుకున్నాడు. అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విజయం సాధించాలని నాగబాబు ఒక సందర్భంలో చెప్పాడు. ఇప్పుడు బాలయ్య అభిమానులు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... బాలయ్య తెలీకపోతే అతని సినిమాకు ఎందుకు బెస్ట్ విశేస్ ఎలా తెలిపావు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ విషయం గురించి బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి. నాగబాబు ఇలా కామెంట్ చెయ్యడం కరెక్ట్ కాదని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. అసలు నాగబాబు ఇలా సడన్ గా ఎందుకు మాట్లాడారో తెలియాల్సి ఉంది. నాగబాబు ఇప్పుడే కాదు గతంలో కూడా ఆవేశంగా అర్థం లేని మాటలు మాట్లాడినా సందర్భాలు మనం చూశాం.

Facebook Comments
Share
More

This website uses cookies.