Kalyan Ram to do movie with village backdrop

నందమూరి హీరో కొత్త సినిమా వివరాలు!

నందమూరి హీరో కల్యాణ్ రామ్ ప్రస్తుతం 118 అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.,కామెరామెన్ గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిఫరెంట్ కన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నివేదా థామస్, శాలినీ పాడే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తాజాగా కల్యాణ్ రామ్ కొత్త సినిమాను ఒప్పుకున్నాడు. ఉయ్యాల జంపాల , మజ్ను చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ డైరక్షన్ లో కల్యాణ్ రామ్ నటించబోతున్నాడు. ఈ సినిమా జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది.

కల్యాణ్ రామ్ చేసే సినిమాలు విభిన్నంగా ఉన్నా చిన్న పొరపాట్ల వల్ల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు. 118 సినిమాపైనే కల్యాణ్ రామ్ హోప్స్ పెట్టుకున్నాడు. విరించి వర్మ డైరెక్ట్ చేస్తున్న సినిమా టోటల్ విలేజ్ బ్యాక్ డ్రాఫ్ లో ఉన్న లవ్ స్టోరితో తెరకెక్కనుందని సమాచారం.

Facebook Comments
Share
More

This website uses cookies.