South Cinema

Nayantara to work with Chiranjeevi again?

చిరు సరసన మరోసారి ఆ హీరోయిన్ !

Nayantara to work with Chiranjeevi again?

వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు కొరటాల శివ చిరంజీవితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జనవరి నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటించబోతోందని సమాచారం. ఈ హీరోయిన్ అయితేనే బాగుంటుందని కొరటాల ఆమెను ఫైనల్ చేసినట్లు సమాచారం.

 

చిరంజీవి తాజాగా నటిస్తోన్న సైరా సినిమాలో కూడా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. వరుసగా రెండు చిత్రాల్లో చిరు సరసన నయన్ నటించడం విశేషం. నిజానికి ఇప్పటికే కొరటాల రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాల్సివుంది. కొన్ని కారణాల వలన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం విశేషం.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ లో ఉన్న ఈ సినిమా ఒక సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కించబడుతోందని సమాచారం. కొరటాల శివ గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాలో సందేశం ఉంటుందని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది దసరాకి చిత్రాన్ని విడుదల చెయ్యాలని చిరు భావిస్తున్నారు.

Facebook Comments
Share