South Cinema

Dookudu girl in Maharshi

మహేష్ బాబు సినిమాలో మరో హీరోయిన్!

Dookudu girl in Maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'దూకుడు' సినిమాలో టైటిల్ సాంగ్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది ఉత్తరాది ముద్దుగుమ్మ మీనాక్షి దీక్షిత్. ఈ మరోసారి మహేష్ బాబు సినిమాలో నటించడానికి రెడీ అయ్యింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న మహర్షి సినిమాలో మీనాక్షి ఒక ప్రేత్యేక పాత్రలో కనిపించబోతోందని సమాచారం..

 

అల్లరి నరేశ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఈ చిత్రం అధికభాగం వ్యవసాయం గురించి ఉండనుందని సమాచారం. మోడ్రన్ ఫార్మింగ్ గురించి ఈ మూవీలో దర్శకుడు చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

Facebook Comments
Share