South Cinema

Rashmika Mandanna to romance Varun Tej?

మెగా హీరో పక్కన రస్మిక మందన్నా !

Rashmika Mandanna to romance Varun Tej?

గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పెద్దగా విజయాలు లేని దర్శకుడు హరీష్ శంకర్ ఈసారి తప్పకుండా సక్సెస్ సాధించాలని ఉన్నాడు. దిల్ రాజు బ్యానర్ లో దాగుడుమూతలు అనే మల్టీ స్టారర్ సినిమా చెయ్యాలని భావించినా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా స్టార్ట్ కాలేదు. సక్సెస్ ఉంటేనే హీరోలు సినిమాలు ఇస్తారు. కానీ హరీష్ చేతిలో ఒక్క గబ్బర్ సింగ్ మినహా పెద్ద హిట్ సినిమా లేనందున ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తిగా లేరు.

 

ఇప్పుడు ఒక కొత్త సినిమా ప్లాన్ చేసారు హరీష్ శంకర్. తమిళ్ లో భారీ హిట్ అయిన “జిగార్తాండ” సినిమాను వరుణ్ తేజ్ తో చెయ్యాలని భావిస్తున్నాడు. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. ర్ మూవీలో వరుణ్ తేజ్ సరసన రస్మిక మందన్నా నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమా తరువాత ఈ హీరోయిన్ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైమ్ వరుణ్ తేజ్ తో రస్మిక నటిస్తోందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Facebook Comments
Share