Samantha to do multiple roles in Nandini Reddy’s movie

సమంత కొత్త సినిమా విశేషాలు!

యూట‌ర్న్ అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంతో అల‌రించిన స‌మంత మ‌రోసారి క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం నుండి ప్రారంభం అయ్యింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందుస్తున్న ఈ సినిమా ను సురేశ్ బాబు నిర్మిస్తున్నాడు.

వివాహం తరువాత తన పంథా మార్చుకుంది కథానాయిక సమంత. కొత్త తరహా చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నది. ముఖ్యంగా లేడి ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ వెళుతోంది. 1980–90 రోజుల్లో మహిళలు ధరించే వస్త్రాలు ఈ సినిమాలో సమంత ధరించబోతోందని సమాచారం. ఈమే చేసే సినిమా ‘మిస్‌గ్రానీ’ రీమేక్‌. నాలుగేళ్ల క్రితం వచ్చిన కొరియన్‌ మూవీ ఇది. ఈ చిత్రంలో సమంత యువతిగానే కాదు 70 ఏళ్ల వృద్ధురాలిగానూ కనిపించింది.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%