ఎనర్జీటిక్ హీరోతో డాషింగ్ డైరెక్టర్ !
హీరో రామ్ మంచి నటుడు, డాన్సర్. వచ్చిన కథలను వచ్చినట్లు లాక్చెయ్యడంతో ఈ మధ్య ఈ హీరోకు సరైన సక్సెస్ సినిమాలు లేవు'. ఇటీవల విడుదలైన హలో గురు ప్రేమకోసమే సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు రామ్.
దర్శకుడు పూరీ జగన్నాధ్ ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం చూస్తున్నాడు. యువహేరో రామ్ తో సినిమా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే పాయింట్ తో పూరీ సినిమా చెయ్యబోతున్నట్లు సమాచారం. ఎప్పటినుండో వీరిద్దరు సినిమా చెయ్యాలి అనుకుంటున్నారు, కానీ ఈ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయ్యింది. ఈ సినిమాను నిర్మాత స్రవంతి కిశోర్ నిర్మించనున్నారు.
రామ్, పూరీ సినిమా గురించి అధికారిక ప్రకటన లేదు. కథ చర్చలు పూర్తి అయ్యాక చిత్ర యూనిట్ సినిమాను అనౌన్స్ చేయనున్నారు. ఇద్దరు ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆశలు ఈ సినిమా పైనే ఉన్నాయి. ఈ మూవీలో నటించే హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియనుంది.
This website uses cookies.