Manchukurisevelalo Movie Teaser Released By Director Maruthi

"మంచు కురిసే వేళలో" టీజర్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ మారుతి

కనులకుపండుగలా అనిపించే లొకేషన్స్ తో మనసుని హత్తుకునే సంగీతంతో 'మంచు కురిసే వేళలో' కచ్చితంగా విజయం అందుకుంటుందని ఆశిస్తున్నారు స్టార్ డైరెక్టర్ మారుతి.

రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతొన్న "మంచు కురిసే వేళలో"సినిమా టీజర్ ను ఇటీవలే లాంచ్ చేశారు మారుతి.

అనంతరం దర్శకుడు మారుతి మాట్లాడుతూ "టీజర్ చాలా బాగుంది.. ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. చాలా చోట్ల తిరిగి మంచి ఔట్ డోర్ లొకేషన్స్ లో సినిమాను షూట్ చేశారు. టీజర్ సినిమా క్వాలిటీని తెలియజేసేలా ఉంది. టీజర్ చూస్తే హీరో రామ్ కార్తీక్ చాలా అనుభవం ఉన్నట్టుగా నటించాడనిపించింది. టీం అందరికీ ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అన్నారు

దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ.. 'మంచు కురిసే వేళలొ' అందమైన లొకెషన్స్ లొ అంతే అందమైన కథ కథనాలతొ తీసిన స్వచ్చమైన ప్రేమకథ. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ‌ఎసెట్ గా నిలుస్తాయి. రామ్ కార్తీక్ కెరీర్‌లో ఇదొక ఉత్తమ చిత్రమవుతుంది.చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలను కంప్లీట్ చేశాము. ఈ నెలలో ఆడియోను విడుదల చేసి డిసెంబర్ లొ సినిమాను విడుదల చెస్తామన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి, పి.ఆర్.ఓ : సాయి సతీష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కధ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం: బాల బోడెపూడి

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%