Naga Shaurya’s new movie stalled

నాగ శౌర్య సినిమా చిక్కుల్లో!

Naga Shaurya's new movie stalled

హీరో నాగ శౌర్య భవ్య క్రియేషన్స్ లో నూతన దర్శకుడు రాజా కొలుసు తో ఒక సినిమా మొదలుపెట్టాడు. ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్లు సమాచారం. నాగ శౌర్య నటించిన నర్తనశాల సినిమా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది అందుచేత నాగ శౌర్య తో చేసే నెక్స్ట్ సినిమాకు 15 కోట్లు బడ్జెట్ పెడితే వర్క్ ఔట్ అవ్వదు కావున చిత్ర నిర్మాత ఈ సినిమాను 7 కోట్లలో చెయ్యమని దర్శకుడి చెప్పడం జరిగింది, కానీ హీరో నాగ శౌర్య ఈ సినిమాను 7 కోట్లకు కాదు ముందు అనుకున్నట్లు 15 కోట్లకు అయితేనే చేస్తానని చెప్పడంతో ఏమీ చేయలేక నిర్మాత ఈ సినిమాను ఆపేసినట్లు సమాచారం.

 

నాగ శౌర్య చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు. ఉన్న సినిమా ఆగిపోయింది. మరి నాగ శౌర్య సినిమాలకు సంభందించి కొత్త న్యూస్ ఏంటో మరి. ఈ హీరో నటించిన ఒక్క ఛలో సినిమా మినహా మిగితా ఏ సినిమాలు పెద్దగా ఆడలేదు. అమ్మమ్మగారిల్లు, కణం, నర్తనశాల సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు ఈ హీరోతో సినిమా చెయ్యడానికి ఏ హీరో ఆసక్తిగా లేడు కావున సొంత బ్యానర్ లో సినిమా తీస్తాడేమో ?

Facebook Comments
Share