South Cinema

Ravi Teja movie in trouble?

రవితేజ సినిమాకు కష్టాలు!

 

Ravi Teja movie in trouble?

 

రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తోన్న అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా నవంబర్ 16 నా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కానీ సినిమా బిజినెస్ ఇంకా పూర్తి అవ్వలేదని సమాచారం. ఈ చిత్రాన్ని కొనడానికి బయ్యర్ల్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం. దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తరువాత ఇలియానా టాలీవుడ్ లోకి ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది..

రవితేజ లాంటి మినిమమ్ గ్యారెంటీ హీరో ఉన్నా ఈ సినిమా బిజినెస్ అవ్వకపోవడం విచిత్రమే. శ్రీను వైట్ల గతంలో తీసిన రెండు ముందు సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వకపోవడమే ఇందుకు కారణమా అనే అనుమానం కలుగుతోంది. రేపు (శనివారం) ఈ సినిమా ప్రీ రిలీస్ ఈవెంట్ గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. ఫంక్షన్ లో రవితేజ ఏం మాట్లాడుతాడో చూడాలి. టీజర్, సాంగ్స్ కు అయితే మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సినిమా ఎలా ఉంటుందో మరి. ఈ సినిమా తరువాత రవితేజ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

Facebook Comments
Share